

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జూన్ 18
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఓబాయి పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించారు కలుజువ్వలపాడు రైతు సేవ కేంద్రం పరిధిలో 10:48 రికార్డులు రైతుల పేర్లు వచ్చి ఉన్నాయి. రైతులందరూ తమ పేర్లు చూసుకొని తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరికీ ప్రభుత్వం వారు అందజేసే పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ డబ్బులు వారి యొక్క ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా నందు జమవుతాయని తెలియజేశారు. జాబితాలో పేర్లు లేని రైతులు ఎవరు కూడా కంగారు పడవలసిన పనిలేదని తరువాత గవర్నమెంట్ వారు మరల ఆప్షన్ ఇచ్చినప్పుడు మిగతా రైతులందరూ నమోదు చేసుకోగలరని తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఈ కేవైసీ చేసినటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ స్కీమ్ నందు ఈ కేవైసీ జరిగినట్లుగా డేటాని పొందుపరిచారని ఈ కేవైసీ గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన పనిలేదని తెలిపారు.
అదేవిధంగా కౌలుకు సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా వీఆర్వో ని సంప్రదించి కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలని తెలియజేశారు కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవలో ప్రభుత్వం వారు అవకాశం కల్పిస్తారని కవులు రైతులందరూ కవులు రైతు కార్డు కొరకు అప్లై చేసుకోవాలని తెలియజేశారు.
ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలుజువ్వలపాడు రైతు సేవ కేంద్రం సిబ్బంది బురయ్య మరియు మల్లికార్జున
కలుజువ్వలపాడు మరియు ఓబాయి పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.