Listen to this article

జనం న్యూస్ 18జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ )

గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సింగరేణి డివైజియం పర్సనల్ మోహన్ రావు కి అన్ని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎన్ సంజీవ్, హైట్ శివ,జెట్టి మోహన్,రవి గౌడ్ అధ్యక్షత వహించగా
ఈ కార్యక్రమంలో * నాయకులు ఆల్బర్ట్, ఏచ్ ఏం ఎస్ నాయకులు గడపల్లి కృష్ణ ప్రసాద్, సీఐటీయూ భూక్యా రమేష్,ఇఫ్ట్ నాయకులు గౌని నాగేశ్వర్ రావు బీఎంస్ రఘు*, లు ప్రసంగిస్తూ ఎన్నో ఏండ్లుగా సింగరేణి ఆనవాయితీ ప్రకారం కంపెనీ వారే ఇంటర్వ్యూలు బయోడేటాలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తారు కానీ కొత్తగా వచ్చిన సౌదా కంపెనీ ప్రైవేట్ ఏజెన్సీ లాగా కొత్తగూడెంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగా నియమకాల పేరుతో నియామకాల ప్రక్రియ మొదలుపెట్టిందని దీనిని తక్షణమే నిలిపివేయాలని వారన్నారు. మొదటిగా సౌదా కంపెనీ ఆఫీస్ మేనేజ్మెంట్కు వినతిపత్ర రూపంలో అన్ని కార్మిక సంఘాలు తెలియజేసినప్పటికీ ఫలితం లేదు కావున ఈరోజు సింగరేణి కొత్తగూడెం జిఎం కార్యాలయం ముందు డివైజియం గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. తక్షణమే ఈ సౌదా ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని వీటి వలన 600 కార్మిక స్థానిక కుటుంబాలు జీవన ఉపాధి కోల్పోతాయని వారన్నారు. సింగరేణి ఓసి కోసం 600 కుటుంబాలు భూములను ఇండ్లను బతుకుతెరువును కోల్పోయి సింగరేణి లాభాలపేక్షను కోసం వారు నిర్వాసితులుగా మారారు. అన్ని కోల్పోయిన జీవనోపాధితో ఆ ఓసీలలో బ్రతుకుతెరువు కొనసాగిస్తున్నారు కానీ నేడు సౌదా కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి 600 స్థానిక కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నది కావున ఈ సౌదా నిర్వహిస్తున్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని లేకపోతే దశల వారి ఆందోళన చేయవలసి వస్తుందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు చిన్ని, వాసు,ఆంజనేయులు,రామ్ చందర్, యాకయ్య, అశోకు, నాగయ్య,శ్రీను,రవి,మాధవరావు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.