Listen to this article

జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై పెల్లెట్ రూపం లొ సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం తుమ్మపాల గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డా అనీల్ కుమార్ మాట్లాడుతూ, రూ.1100 విలువగల 50 కేజీల సమీకృత దాణా బస్తాను కేవలం రూ.555 కే పాడి రైతులకు 50% సబ్సిడీ తో అందించనున్నట్లు తెలిపారు. పశువుల పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. తొలి దశలో అనకాపల్లి మండలం లో మొత్తం 220 బస్తాల (సుమారు 11000 కిలోలు) స్టాక్ మంజూరు అయిందని, వాటిని 160 పాడి రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. రైతులకు ఇది ఆర్థిక భారం లేకుండా పశు పోషణను మెరుగుపర్చే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మపాల గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు పంచదారల కన్నారావు తెలుగుదేశం మండలాధ్యక్షుడు కర్రీ బాబి కూటమి నేతలు, ఏ హెచ్ ఏ వెంకట, గోపాలమిత్ర రమణ, హరి మరియు పాడి రైతులు పాల్గొన్నారు.