Listen to this article

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్,జూన్18,అచ్యుతాపురం:

ఎలమంచిలి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ బత్తుల రాజశేఖర్ గారు.రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు యోగాంధ్ర కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు..ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా,చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక పండగలా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు. టిడిపి,బీజేపీ,జనసేన శ్రేణులతో మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ జనాన్ని తరలించి చరిత్రలో విశాఖ నగరం నిలిచే విధంగా కృషి చేయుటలో కీలక పాత్ర వహించాలని ఆయన తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా బస్సు సదుపాయంతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తుందని, యోగాంధ్ర విజయవంతం చేయడంలో యంత్రాంగమంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.