

జనం న్యూస్ – జూన్ 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో బుధవారం నాడు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పై అమృత్ కాల వికసిత భారత్ సంకల్ప సభను బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబోయిన రాజుఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొమ్ము రామదాసు, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గణేష్ తంగరాజు లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాతూ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను,అభివృద్ధి ,సంక్షేమ ఫలాలను ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన తెలియజేయాలని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా దేశంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా విప్లవాత్మక నిర్ణయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు చేరుతున్నాయని తెలిపారు. 11 సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానంలోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించింది అని, అలాగే అన్ని రంగాలలో యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళలకు సాధికార స్వలంబన కోసం 33 శాతం రిజర్వేషన్లు ,ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత మహిళలకు ఇవ్వబడుతుందని, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ను, రైతులకు మద్దతు ధర, కిసాన్ సామాన్ నిధి, ఫసల్ బీమా యోజన ఇలా ఎన్నో రకాలుగా అన్ని వర్గాల ప్రజల కు నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర అయిందని అన్నారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం ముందుచూపుకు నీదర్శనం అని, ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ రక్షణ విషయంలో రాజీ లేదని మరోసారి రుజువు అయిందని వారు తెలిపారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు..ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షురాలు జయమ్మ, కే ఎన్ సుమ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి బొమ్మిరెడ్డి పద్మా రెడ్డి, పట్టణ కార్యదర్శులు విక్రమ్,,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.