Listen to this article

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ఇచ్చి శంకుస్థాపన చేసిన ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని
పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఇండ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు అని కొనియాడారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇచ్చి సొంతింటి కలను సహకారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ లబ్ధిదారులు హర్షణ వ్యక్తం చేశారని పేర్కొన్నారు.అదేవిధంగా నిబంధనకు అనుగుణంగా తొందరగా ఇల్లు పూర్తి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ ఏఎంసి డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ లింగంపల్లి మహేష్ గ్రామ శాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్ టౌన్ యూత్ అధ్యక్షులు వడ్లూరి ప్రవీణ్ కుమార్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఐలేని వంశీధర్ రావు మల్యాల ఎల్లయ్య పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.