Listen to this article

జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా వాడకం ఉంటుంది. కానీ అవసరానికి సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవ కేంద్రాలలో, దుకాణాలలో యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వలు సరిపడా లేవని వ్యాపారులు చెప్పుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుకాణాల వ్యాపారులు పంపిణీ దారుల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు బస్తా 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి ఉంచి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు…