

జనంన్యూస్. 19.
సిరికొండ. ప్రతినిధి.
కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మం టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ…శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని, కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మంఅని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ అన్నారు. గురువారం నాడు ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభ లను సిరికొండ మండల కేంద్రం లోని కామ్రేడ్. ఎం. రాజేందర్ నగర్ ( ఎంఎన్ పంక్షన్ హాల్)లో నిర్వహించారు. ఈసందర్బంగా -టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ.మాట్లాడుతు: దేశంలో శ్రమజీవులను శ్రమ దోపిడీకి గురి చేస్తు యాజమాన్యాలు కుబేరులు అవుతున్నారన్నారు. పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని దోపిడీ చేసే కోటీశ్వర్ల కొమ్ముఖాస్తు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. అదాని, అంబానీ ల మోచేతి నీళ్లు త్రాగుతు కార్మికులకు బలిపశువులను చేసే లేబర్ కోడ్స్ తీసుకొని రావడం సిగ్గుచేటు అన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు జిపి వర్కర్స్ ప్రధానమైన కార్మిక రంగం ఉందని కార్మికుల పక్షాన టియుసిఐ సమరసియుల పోరాటం నిర్వహిస్తుందన్నారు. టి యు సి ఐ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నిర్మాణం కలిగి దేశకార్మికవర్గంలోనే బలమైన కార్మిక సంఘంగా ఉంది అన్నారు. అన్నిరకాల సంఘటిత, అసంఘటీత కార్మికులను ఐక్యం చేస్తు విప్లవ కార్మిక సంఘంగా ముందుకు వెళ్తుంది అన్నారు. అంతిమంగా కార్మిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు.