

బిచ్కుంద జూన్ 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులచే గ్రామంలోని పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్లు జూబ్రె సంజీవ్ మాట్లాడుతూ యోగ ఒక ప్రాచీన భారతీయ జీవన విధానం దీని ద్వారా శరీరం మనసు మెదడును పూర్తిగా ఆరోగ్యంగా ఉంచవచ్చని అన్నారు. యోగా చేయండి ఆరోగ్యం పొందండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రచ్చ శివకాంత్, డాక్టర్ నరసింహులు, వై రాజ్ కుమార్, చంద్రకాంత్, నాగనాథ్, అనిల్ రెడ్డి, యోగేష్, హనుమంత్, భానుదాస్, మల్లికార్జున్, దేవీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
