

జనంన్యూస్ జూన్ 19:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 55వ జన్మదిన సందర్బంగా కేకు ను కోసి ఒకరినొకరు తినిపించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడుసోమ దేవరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడుశివాన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం లో జన్మించి, దేశరక్షణ కోసం, ప్రజల కోసం పాటుపడుతూముందుకు సాగుతున్న మహా నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతోఆనందంగా ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఆడేం గంగప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.