

మండల విద్యాధికారికి వినతి పత్రం అందించిన పాత్రికేయులు
జనం న్యూస్,జున్ 19,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను అందించాలన్న ఆదేశాలను జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేయడంతో గురువారం కంగ్టి మండల విద్యాధికారి ఎండి రహీముద్దీన్,ను పాత్రికేయ మిత్రులు వినతి పత్రంతోపాటు జిల్లా విద్యాధికారి జారీచేసిన సర్కులేట్ పత్రాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి ఆదేశాల అనుగుణంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్యను అందించే దిశగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలను జారీ చేస్తామని అన్నారు. పాత్రికేయ మిత్రులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లల ఆధార్ కార్డ్,తమ పత్రిక ఐడి కార్డ్, ఏ పాఠశాలలో చదువుతున్న వివరాలను ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సుదర్శన్ రావు,రామ్ రెడ్డి, రమేష్,సంతోష్ రెడ్డి,విజయ్ కుమార్, సంగ్రామ్,సల్మాన్,జలీల్ రుస్తుం,నాగప్ప, చంద్రకాంత్,ఉదయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.