

జనం న్యూస్ జూన్ 19 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ పోచాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది ఈరోజు తెల్లవారుజాము నుండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని పుట్టింటి ఆడపడుచు గా భావిస్తూ ఆమెకు చీర సారె పెట్టి అమ్మవారిని దర్శించుకోవడంజరిగినది ఆలయ కమిటీ వారు గ్రామంలో దాతల సహకారంతో ఆలయం వద్ద భజన కార్యక్రమము మరియు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ కేశనకుర్రు గౌడ స్ట్రీట్ ధార్మిక సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ కనకారావు పరమట భాను పరమట పద్మ పర్యవేక్షణలో సేవలు అందించడం జరిగినది వీరిని గ్రామ పెద్దలు సాగి బాపిరాజు మట్టపర్తి భైరవమూర్తి నంబు సత్యనారాయణ తదితరులు అభినందించడం జరిగినది.