

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ. భిన్నత్వంలో ఏకత్వం వంటి విశిష్ట సిద్ధాంతానికి పుట్టినిల్లు అయిన భారతదేశం ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం అనే నాలుగు స్తంభాల మీద నిర్మించ బడిన ఐక్యత చిహ్నమని భారత్ జోడో యాత్ర ద్వారా స్వయంగా తెలుసుకొని దేశాన్ని దేశ ప్రజలను దేశాన్ని నడిపించే దిక్సూచి అయిన రాజ్యాంగాన్ని కాపాడాలని కంకణం ధరించిన నిజ రక్షకుడు రాహుల్ గాంధీ అని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు. నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం చిలకలూరిపేట కాంగ్రెస్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన సందర్భంగా జేజేలు పలికారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరమని భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని కాపాడే నిజ రక్షకుడని వేనోళ్ళ కొనియాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన కేకును నాయకులు కార్యకర్తలు కలిసి కట్ చేసి ఒకరికొకరు ఆనందంతో తినిపించు కున్నారు. భారతదేశంలో లౌకికవాదాన్ని కాపాడగలిగిన ఏకైక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని రాజ్యాంగంపై అధికార పక్షం చేస్తున్న దాడులను విజయవంతంగా తిప్పి కొడుతున్నారని అన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు, వందల ఎకరాల భూములు అత్యంత విలువైన విశాలమైన భవనాలు స్వతంత్ర భారతదేశానికి దానంగా ఇచ్చిన గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీ గారికి ఈరోజు సొంత నివాస గృహం కూడా లేదని అది వారి నిజాయితీకి దర్పణం వంటిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గళం విప్పిన ప్రతిసారి అవినీతి ఆరోపణలు గుర్తించి అక్రమ కేసులు ద్వారా ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుందని భయమంటే తెలియని రాహుల్ గాంధీ అక్రమ కేసులను దూదిపించల వలె తరిమి కొడుతున్నారని అన్నారు రుణభారతాన్ని విముక్తి చేయడం ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమని కొట్టుమిట్టాడుతున్న యువత భవిత తేజోవంతం చేయడం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమని వేనోళ్ల కొనియాడారు ఈ కార్యక్రమంలో రైస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చుక్క విన్సెంట్ పాల్ రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ నసురుద్దీన్ జిల్లా కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు జనాలు జాస్టి నాగాంజనేయులు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాగి మల్లికార్జున రావు, రెడ్డెం నర్సిరెడ్డి నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాగి నరసింహారావు పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారు చోల స్వప్న కుమార్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ నాజ్ సిరాజ్ రాహుల్ సేన అధ్యక్షుడు షేక్ లాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యప్పాల అంజిరెడ్డి ఉప్పాల బాబు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాం బాబు పెదలంక వెంకటేశ్వర్లు అల్లం సుబ్బారావు మంగళగిరి శ్రీనివాసరావు మద్దుల ప్రసాద్ షేక్ దాదాసాహెబ్ షేక్ మస్తాన్ వలి వల్లెపు ఆంజనేయులు ఎన్ గోపి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.