Listen to this article

జనం న్యూస్ జూన్ 19 ముమ్మడివరం ప్రతినిధి


అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు “యోగాంధ్ర -2025” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 6 గంటలకు కిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కిమ్స్ చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ రాజు, ఎం.డి. రవి కిరణ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా యోగా కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనంద రావు , జాయింట్ కలెక్టర్ నిశాంతి , జిల్లా డి.ఆర్.ఓ. శ్రీమతి రాజా కుమారి, డి.ఎస్.పి. శ్రీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ , ఎం.ఎల్.సి. కుడిపూడి సూర్యనారాయణ, మెట్ల రమణ బాబు, యాళ్ల దొరబాబు ముఖ్య అతిధులుగా విచ్చేసారు ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి గారి పిలుపుతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో యోగా గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ మహా యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిమ్స్ చైర్మన్ శ్రీ చైతన్య రాజుని ప్రశంసించారు.యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు కనీసం 20 నిముషాలు తమ ఆరోగ్యం కోసం యోగా మరియు వ్యాయామం చేయాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి సూచించారు.కిమ్స్ చైర్మన్ శ్రీ చైతన్య రాజు మాట్లాడుతూ 2047 నాటికి భారత ప్రభుత్వం వికసిత భారత దేశంగా అభివృద్ధి చెందుతున్న వేళ ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా మరియు సంతోషముగా ఉండాలన్న మన గౌరవ ప్రధాని మోడీ ఆశయం చాలా గొప్పదని, అదే బాటలో మన గౌరవ ముఖ్య మంత్రి గారి యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా మేము ఈ నెల 14, 16 మరియు 19 వ తేదీలలో యోగ కార్యక్రమం నిర్వహించామని, 21 వ తేదీ కూడా ఇదే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు యోగ విద్యను పాఠ్యాంశాలతో బోధించే ఆలోచన కూడా ఉన్నదని తెలిపారు. తదుపరి అయన మాదక ద్రవ్యాల వినియోగ నివారణ కొరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. యోగ సాధన చేసి వికసిత భారత దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా కళాశాల విద్యార్థులు, అథ్యాపకులు, సిబ్బంది, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు, పుర ప్రముఖులు, వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్,రోటరీ క్లబ్, ఛాంబర్ అఫ్ కామర్స్, ప్రెస్ క్లబ్, ఐ.ఎం.ఏ. మొదలగు వివిధ స్థానిక అసోసియేషన్ సభ్యులు, ఎం.ఆర్.ఓ.లు శ్రీ అశోక్ ప్రసాద్ గారు, శ్రీ.దివాకర్ గ , కిమ్స్ డీన్ డా.ఆనంద్ ఆచార్య , మెడికల్ సూపరింటెండెంట్ డా.పి. సుబ్బారావు , కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన రాజు , సి.ఏ.ఓ. రఘు మరియు అనేక మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు.