Listen to this article

జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కోడెపాక గ్రామంలో పోలీస్ కళా జాగృతి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, 4 జీ అంశాలపై పాటల ద్వార నాటిక ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పరకాల రూరల్ సీఐ పి రంజిత్ రావు ఎ ఎస్సై కుమారస్వామి హెడ్ కానిస్టేబుల్స్ ,కానిస్టేబుల్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ సెక్రటరీ , జాగృతి కళాబృందం ఇంఛార్జి ఎఎస్సై నాగమణి , కళాకారులు విలియమ్, వేంకటేశ్వర్లు, రత్నయ్య , శ్రీనివాస్, విక్రమ్,చిరంజీవి, 200 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు…..