

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, టెస్లా అధ్యక్షులు మల్లిక్ కేశవరాజు, మాజీ అధ్యక్షులు మురళి చందూరి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాపారావు రాళ్ల బండి మూర్తి దాతృత్వంతో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి1-5 తరగతులకు చెందిన పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేయాలని కార్యక్రమాన్ని మండల విద్యా వనరుల కేంద్రం నందు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు వివిఎస్ రత్నకళ ఈరోజు చిలకలూరిపేట మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వాటిని మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులు కూడా అందజేస్తామని తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తెలుగుగడ్డపై పేద విద్యార్థులకు సహాయం చేసేటువంటి మంచి మనసున్నTELSA కమిటీ సభ్యులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మండల పరిషత్ పాఠశాలలో విద్యాభివృద్ధికి వారు కృషిని అభినందించారు, ఈ కార్యక్రమ ప్రోత్సాహకులు ఘంటసాల కరీముల్లా కృషి వల్ల ఈ నోట్ బుక్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు బలో పేతం చేయడానికి సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నామని తెలిపారు.