

జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ భారత దేశ భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాక జోడో యాత్ర చేసి దేశాన్ని సంఘటితం చేశారని, యూపీఏ హయాంలో రెండుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించే అవకాశం వచ్చినప్పటికీ తృణప్రయంగా పదవిని వదులుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో కులగణన అనే అంశాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కులగణన నిర్వహించడం జరిగిందన్నారు. కేవలం రాహుల్ గాంధీ సూచన మేరకే కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణన చేయాలని నిర్ణయించారని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాసని చంద్రప్రకాష్, మారపల్లి రవీందర్, చిందం రవి, వైనాల కుమారస్వామి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, వెంకటరాజి రెడ్డి, చింతల రవిపాల్, మామిడిపల్లి సాంబయ్య, గజ్జి ఐలయ్య వరదరాజు మార్కండేయ మారపల్లి రాజేందర్, వల్పదాసు రాము చిరంజీవి, రవి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు....