

పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు
ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ జూన్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ వార్డు నెంబర్ 26 లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్క ఇండ్లు నిర్మించాలని సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణి పకడ్బందీగా అమలు చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం అని అన్నారు. వారి వెంట తాజా మాజీ చైర్మెన్లు మాజీ కౌన్సిలర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
