Listen to this article

జనం న్యూస్ జూన్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:

నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్ని కల నిర్వాహణ అధికారి భూక్యా లక్ష్మన్ నాయక్ ఏ డి ఇ ,తాజా మాజీ బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్యా చంద్రు నాయక్ ,ఆర్మూర్ డివిజన్ ఎన్నికల పర్యవేక్షకుల బాదావత్ శర్మ నాయక్ గార్ల ఆధ్వర్యంలోబాల్కోండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం ఎన్ని కలునిర్వహించిన కుమ్మర్ పల్లి మండల బంజారా సవా సంఘ్ మండల అధ్యక్షుడు గా మాలవత్ ప్రకాష్ నాయక్ , ప్రధాన కార్యదర్శి గా లాకావత్ గంగాధర్ నాయక్ లతో పాటు ఏర్గట్ల బంజారా సవా సంఘ్ మండల అధ్యక్షుడు గా రాథోడ్ ఆంజనేయులు నాయక్ , ప్రధాన కార్యదర్శి గా మాలవత్ భీమా నాయక్…లను తాండా నాయక్, కార్భారీలు మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఏక గ్రీవవముగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ …బంజారా బిడ్డలు ఐకమత్యం తో ఉండాలని బంజారా జాతి పట్ల అంకితభావం తో నిజాయితీ తోపని చేయాలనీ అన్నారు.జాతి ఉన్నతిని కాపాడాలని నూతనంగా ఎన్నికైన మొత్తం కార్య వర్గ సభ్యులను కోరుతూ.. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శాలువాలతో సన్మానించారు.