

అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలి.
డిజిటల్ సర్వేను రద్దు చేయాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుజి. నాగయ్య
జనం న్యూస్ జూన్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
భూమిలేని పేద వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య డిమాండ్ చేశారు. గురువారం మునగాలమండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి12000 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి16 నెలలు అవుతున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. భూభారతి లో అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచి ఇవ్వాలన్నారు.అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. దళిత, గిరిజన పేదలకు ఇంటి నిర్మాణానికి ఏడు లక్షలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు కొత్త పింఛన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి పకాయలు విడుదల చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధికి నిధులు పెంచకుండా రెండున్నర లక్షలు ఉపాధి అవసరం ఉండగా బడ్జెట్ 86000 కేటాయించి ఉపాధిని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతుందని నాగయ్య అన్నారు.పని ప్రదేశాలలో కూలీలకు నీడకు టెంటు,కూలీలకు నీడకు త్రాగడానికి మంచినీరు మెడికల్ కిట్టు చిన్నపిల్లల సంరక్షణకు ఆయాను ఉంచటం వంటి సౌకర్యాలు కల్పించాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వై పల్యం చెందాయని వారన్నారు. ప్రభుత్వం పని చూపకపోతే చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు చెల్లించాలని కోరారు.మెట్ల వ్యవస్థను పునరుద్దించాలి ని అన్నారు.కేరళ వాపక్ష ప్రభుత్వం మోడలుగా పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి పని వర్తింపజేయాలని పని దినాలు 150 రోజులకు పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచి నెలవారీగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు సతీమణి ములకలపల్లి కుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు,సంగం జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల నగేష్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,సోమపంగా జానయ్య, పోసన బోయిన హుస్సేన్, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, నారసాని వెంకటేశ్వర్లు, జంపాల స్వరాజ్యం, జిల్లా కమిటీ సభ్యులు గుండు సైదులు, ఆరే రామకృష్ణారెడ్డి, దోసపాటి బిక్షం తదితరులు పాల్గొన్నారు.
