

జనం న్యూస్ జూన్ 20, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం :
మండలంలో గల వేములకుర్తి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గుమ్మాల గంగన్నను నియమించడం జరిగింది, ఈ కమిటీలో భాగంగా ఉప అధ్యక్షులుగా దుంపేట మహేష్, క్యాషియర్ గా పుప్పాల అశోక్, రైటర్ గా సందుపట్ల వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు, ఈ కమిటీలో సభ్యులుగా బెజ్జారపు శ్రీనివాస్, ఆరె మల్లయ్య, లంక సురేష్, అక్క పెళ్లి రాజేందర్, మాలేపు రాకేష్, గోడిసెల వెంకటేష్, రెడ్డవెన రాజశేఖర్, భాష రాజమల్లు, పట్నం రాములు, అల్లపు చిన్న నరసయ్య, ఇజాపు రాజలింగం, కల్లెడ నరేందర్ తదితరులుగా ఉన్నారు, అనంతరం గుమ్మాల గంగన్న మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు, గ్రామ అభివృద్ధి కొరకై అన్ని వేళలో గ్రామంలో అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు
