Listen to this article

జనం న్యూస్ జూన్ 20 ముమ్మిడివరం ప్రతినిధి

డా.బి. ఆర్. ఏ.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలంలో యర్రంశెట్టివారిపాలెం గ్రామంలో పి.గన్నవరం మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో వికసిత భారత దేశపు అమృతకాలం సేవ,సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీ జనతాపార్టీ జాతీయ,రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు జిల్లాలో గల ప్రతీ మండలంలో వికసిత భారత్ సంకల్ప సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి అయ్యాజి వేమా మరియు జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పాల్గొన్నారు, ఈ సమావేశానికి సంకల్ప సభ మండల కన్వీనర్ శ్రీనివాస నగేష్ మాలే, జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ గార్లు మాట్లాడుతూ మోదీ గారి పాలనలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో 4 వ స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో 3 వ స్థానానికి చేరుకుంటామని తెలియచేస్తూ, మోదీ గారి పాలన లో సామాన్య మానవుడి నుండి గ్రామ,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర,దేశ ప్రయోజనాలు చేకూర్చే విధంగా పాలన కొన సాగిస్తున్నారు అని తెలియచేశారు, కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. శ్రీనివాస్, చిట్టినీడి రంగసాయి,సాదిక్, డి.వి.రాజు, పితాని వెంకటేశ్వర రావు, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.