

జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మరియు గాంధీ నగర్ కాలనీలలో డ్రైనేజీ, రోడ్లు మరియు పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. గాంధీ నగర్ కాలనీ వద్ద డ్రైనేజీ పుడుకుపోయి నిండిపోవడంతో జి.ఎచ్.ఎం.సి ఎయిర్ టెక్ యంత్రం సహాయంతో పూడికను క్లియర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను కూడా నిర్మిస్తామని తెలియచేసారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి.. మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, సి హెచ్. భాస్కర్, పోశెట్టిగౌడ్, మల్లేష్, ప్రభాకర్, మల్లేష్, సదానంద్ గౌడ్, నరసింహులు, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, ఖలీమ్, సంతోష్ బిరాదర్, రవీందర్, శ్రీను, కుమార్, సత్తిబాబు, మధులత, యస్మిన్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, సూపర్వైజర్ శివ, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
