

నేటితో ముగియనున్న భూ భారతి చట్టం 2025, అవగాహన సదస్సులు
ఎమ్మార్వో సి భాస్కర్
జనం న్యూస్,జున్ 20,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి చట్టం 2025 ప్రకారం రైతు సోదరులు తరచుగా భూ సమస్యల కొరకు తిరిగి వేసారకూడదన్న సదుద్దేశంతో,గ్రామ గ్రామాన రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.భూ భారతి చట్టం 2025 ద్వారా రైతుల యొక్క సమస్యను తెలుసుకొని సత్వర పరిష్కారం చేసే దిశగా గ్రామ రెవిన్యూ సదస్సులను నిర్వహించి,సమస్యల అర్జీలు తీసుకుని పరిష్కరిస్తామని ఎమ్మార్వో సి భాస్కర్, అన్నారు.భూ అవకతవకల విషయంలో భూ యజమానులు మీ సమస్యల సర్వ ఆధారాలతో అర్జీలు ఇచ్చినట్లయితే సమస్య పరిష్కరించడానికి ఇబ్బంది కాకుండా ఉంటుందని అన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలలో రైతు సోదరులు తమ సమస్యల అర్జీలు ఇచ్చిన వాటినన్నిటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన పిమట సమస్యలను పై అధికారుల ఆదేశాల అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.గతంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలను భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రికార్డులను సరి చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముగ్ని నాయబ్ తాసిల్దార్, ఆర్ఐ మలేష్వారెడ్డి, ఎండి తాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ గుండు మోహన్, రావుఫ్,వినోద్, గోపాల్,మలేష్, ప్రవీణ్,శ్రీనివాస్, మాణిక్యం,మల్లేష్,సంజయ్,సాయిలు,శంకర్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రావు,రైతులు తదితరులు పాల్గొన్నారు.