

జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథునికే వారి సంఘం సభ్యులు,గొందలి సంఘం కళాకారులతో ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి
చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను గొందళి సమాజ్ సంఘం ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బీసీ జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందజేసిన శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు,తెలంగాణ రాష్ట్ర గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్ నాథ్ దున్గే.ఈ సందర్భంగా ఏక్ నాథ్ మాట్లాడుతూ గొందళి సమజ్ సంఘం పడుతున్న ఇబ్బందులను బీసీ కమిషన్ ముందు గొందళి సంఘం కళాకారులతో వివరంగా ఆటపాటలతో చూపించిన గొందళి సమాజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాద్ దున్గే ఇప్పుడిప్పుడే తమ పిల్లలు పై చదువులు చదువుతున్నారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గొందళి సమాజ సంఘం ను బీసీ జాబితాలో చేర్చడం వల్ల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్లు, కులం సంఘం భవనాలు తదితర సర్టిఫికెట్లు ప్రభుత్వ నుండి అందుతాయి కావున రాష్ట్ర ప్రభుత్వం తమ విన్నపమును దృష్టిలో పెట్టుకొని తమ కులమును బీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి విన్నవించారు.బీసీ జాబితాలో తమ కులం లేకపోవడంతో తమ పిల్లలు,తము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలా ఏళ్లుగా తమ గోడు వెల్లబోసుకుంటున్నామని గత ప్రభుత్వంలో సైతం వినతి పత్రాలు అందజేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ సంఘమును బీసీ జాబితాలో చేర్చి తమ సమస్యలు పరిష్కరించాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కు వినతి పత్రం అందజేసిన శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు,తెలంగాణ రాష్ట్ర గొందళి సమజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్ నాథ్ దుగ్గే.సానుకూలంగా స్పందించిన ,బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గొందళి సమజ్ సంఘం సభ్యులు, కళాకారులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.