

రిజిస్ట్రేషన్ లో బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి
డిగ్రీ కొత్త కోర్సులు సద్వినియోగం చేసుకోవాలి అందుబాటులో బీఎస్సీ ఫార్మాసిటికల్ సైన్స్ , బీకాం హెచ్ఆర్ ఆపరేషన్స్
బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో మూడో విడత డిగ్రీ అడ్మిషన్లు ఈనెల 25వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందని ప్రిన్సిపాల్ కె అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని హంగులతో సకల సదుపాయాలతో కొనసాగుతున్న బిచ్కుంద డిగ్రీ కళాశాలలో 2025 2026 విద్యా సంవత్సరంలో నూతన కోర్సులు ప్రారంభమయ్యాయని వాటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు దోస్త్ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అందజేస్తున్నామని ఇప్పటికే రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాగా మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనదని ఈనెల 25 వరకు కొనసాగుతుందని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దోస్త్ అడ్మిషన్ల సందేహాల కొరకు కోఆర్డినేటర్ డాక్టర్ జి వెంకటేశం సెల్ నెంబర్ 9492795524 సంప్రదించగలరు