

బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )లో నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా శుక్రవారం రోజున అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ మాట్లాడుతూ డ్రగ్స్ మాయలో పడి యువత వారి అమూల్యమైన జీవితాలని వృధా చేసుకోవద్దని సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ , అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు