Listen to this article

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్


జనం న్యూస్ 21జూన్ పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండలంలోని ఏడు మోట్లపల్లిలో గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లాస్య శ్రీ తో కలిసి నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇండ్లకు భూమి చేసినారు. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అనంతరం మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు మంజూరు ఇవ్వకపోవడంతో నిరుపేదలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక 15 నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేశారని ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ రాబోవు రెండు సంవత్సరాల్లో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాల అందరికీ ఇండ్లు మంజూరు చేపిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడుముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు ఇస్లావత్ రవి నాయక్ మందపల్లి అంజయ్య మండల నాయకులు కడారి తిరుపతి స్థానిక నాయకులు మేక తిరుపతిరెడ్డి అంజి ఆకుల కిష్టయ్య పంచాయతీ కార్యదర్శి రజిని కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు