

పప్పల నిర్ణయం పై టీడీపీ నాయకులు ఆవేదన
జనం న్యూస్, జూన్ 20 అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలంలో 15 రోజుల క్రితం మండల అధ్యక్షులను ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదని,మండల నాయకులతో ఓట్లు వేయించి మండల అధ్యక్షుడుని ప్రకటించాలని
పార్టీ పెద్దలు మంత్రి కొల్లి రవీంద్ర జిల్లా ఇంచార్జ్, బత్తుల తాతయ్యబాబుకు ఇటీవల టీడీపీ స్థానిక నాయకులు వినతిపత్రాన్ని అందించారు. అచ్యుతాపురంలో గల స్థానిక ఎస్కేఆర్ నందు సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి అభిప్రాయం మేరకు ఐక్యంగా ఉండి మండల అధ్యక్షులని ఎన్నుకోవాలని మంత్రి రవీంద్ర తెలిపారు. పప్పల చలపతిరావు గురువారం ఏకపక్షంగా మండల అధ్యక్షులు పేరును ప్రకటించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నాయకులు జనపరెడ్డి నర్సింగరావు, కునిశెట్టి రమణ, కర్రీ వెంకటరమణ, మండల సీనియర్ నాయకులు వాపోతున్నారు.ఈ నిర్ణయం పై రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర, బత్తుల తాతబాబు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీనియర్ నాయకులకు కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ ఏకపక్ష నిర్ణయానికి మండలంలో ఉన్న సీనియర్ నాయకులు ముఖం చాటేశారని, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకుండా పప్పల చలపతిరావు ప్రకటించడం బాధాకరమని, కార్యకర్తలు అందరిని సమన్వయం చేసి నిర్ణయాలు వెనక్కి తీసుకుని మండలంలో ఉన్న సీనియర్ కార్యకర్తలతో ఓటింగ్ ఏర్పాటు చేసి మండల అధ్యక్షుడుని ప్రకటించాలని మండల నాయకులు,యువకులు కోరుతున్నారని,ఇప్పటికైనా ఈ నిర్ణయం పై ఆలోచన చేసి కార్యకర్తల సమావేశంలో ప్రకటించాలని మండల టీడీపీ సీనియర్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కోలా మహేష్,నాగేశ్వరరావు మామిడి శివ అప్పారావు, బండి అప్పారావు,కొయ్య మహాలక్ష్మి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.