Listen to this article

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ గురువారం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చంద్రబోస్‌ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజినగర్‌ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ మహానీయుని చిత్రపటానికి జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.