Listen to this article

జనం న్యూస్ జూన్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప సభ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపూరి రాజమౌళి గౌడ్ పాల్గొన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాల లో సేవా సుపరిపాలన పేదల సంక్షేమార్గంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంది మన సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి ప్రపంచంఅనిచ్చిత్త పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగు ఎదుగుతుందని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయత్న్ సబ్కా విశ్వాస్* అనే మంత్రంతో ప్రతి పౌరుడిని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చారని దేశం మొత్తం వికసిక్ భారత్ లక్ష్యం వైపు చేరుకునే దిశగా ఏకతాటిపై ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగి రూపాయలు 23.622 కోట్లకు చేరాయి ప్రచండ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ వంటి స్వదేశీ తయారుచేసిన ఆయుధాలను సైనికులు విజయవంతంగా వినియోగించారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైనిక దళాలు ఆక్రమిక కాశ్మీర్ (పిఓకే) పాకిస్తాన్ ప్రాంతంలో 9 ఉగ్రవాద శిబిరాలు 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడం జరిగిందని
గత 11 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను,పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య, రోడ్డులు తదితర రంగాలలో సాధించిన పురోగతిని,దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా మార్చే దిశగా మోదీ దృఢ సంకల్పాన్ని వివరించారు.ప్రజల మద్దతుతో నూతన భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన పెంచేందుకు ఈ సభలు ముఖ్యపాత్ర వహిస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు యువ మోర్చా జిల్లా కార్యదర్శి లడే శివ, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, పోల్ మహేందర్, మంద సురేష్ మండల కోశాధికారి కుక్కల మహేష్, బూత్ అధ్యక్షులు, కన్నెబోయిన రమేష్, నూనె వెంకటేష్ కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, బత్తుల రాజేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, కుక్కల సతీష్, మూడేడ్ల పైడి, మందమదు, చెక్క దినేష్, టీ రాజు,కుక్కల రమేష్, ఆకుతోట భాను, మూడేళ్ల రాంప్రసాద్ మోతె విక్రం, జక్కుల ఓదెలు, సిరిపురం కొమురయ్య, కౌటాం శివ, శ్రీరాముల తిరుపతి, సిరిపురం మహేందర్ గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు