

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు
మా పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చిన దొంగ నా కొడుకులు ఎవరు అంటూ లేడీ డాన్ హల్ చల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో సైతం గందరగోళం సృష్టించారు కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్ని చంపుతాం అంటూ బెదిరిస్తున్న లేడీ డాన్ శిరీష భాయ్.ఈనెల 14వ తారీఖున nrt సెంటర్లో ఉన్న విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ నందు నా ఇద్దరు బిడ్డల స్కూల్ బ్యాగ్స్ కొనేందుకు నేను నా భార్య బిడ్డలము వెళ్ళాము.అక్కడ సుగాలి కాలనీకి చెందిన ఒక అమ్మాయి గణపవరానికి చెందిన ఒక అబ్బాయి మమ్మల్ని దుర్భాషలాడుతూ మా మీదకి దాడికి తెగబడ్డారు నన్ను నా భార్య ని కొట్టారు నేను వెంటనే 100 నెంబర్ కి డయల్ చేశాను పోలీసు వారు అక్కడికి వచ్చి 100 ఫోన్ చేసింది ఎవరు అని తెలుసుకొని నన్ను మా మీద దాడి చేసిన వారిని పోలీస్ జీప్ లో స్టేషన్ కి తీసుకు వచ్చారు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వెంటనే విశాల్ మార్ట్ వారు మాదే తప్పు అయ్యింది అంటూ ఇంకొకసారి ఇలా జరగకుండా చూస్తాం సారీ చెబుతున్నాం అని మమ్మల్ని అడగగా మేము లేదు వారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను కేసు కట్టాల్సిందని పోలీసు వారిని కోరినాను పోలీసు వారు కూడా విచారించి నిజ నిజాలు తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కంప్లైంట్ ఇచ్చాను ఎందుకంటే ఒక లాయర్ వృత్తి చేసే నాకే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు ఎలా అని నేను పోలీసు వారిని కోరడం జరిగింది.
ఆ తర్వాత శిరీష భాయ్ ఒక 30 మంది లేడీస్ ను తీసుకొని వచ్చి స్టేషన్ దగ్గర్లో ఉన్న నన్ను ఏరా మా పిల్లలపై కంప్లీట్ ఇస్తావా నీకు ఎంత ధైర్యం మర్యాదగా కంప్లైంట్ వెనక్కి తీసుకో లేకపోతే నువ్వు చిలకలూరిపేటలో ఎలా తిరుగుతావో చూస్తాను అంటూ బెదిరించింది మీ బెదిరింపులకు నేను భయపడనని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు 15వ తారీకు శిరీష బాయ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మా అమ్మాయిని మరలా స్టేషన్కు ఎందుకు పిలిపించారు రాత్రి తీసుకు వెళ్లాను గా అని అక్కడ సెంట్రీపై పోలీసు వారిని ఇష్టానుసారంగా దుర్భసలాడుతూ ముద్దాయిని స్టేషన్లో నుంచి బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది అందుకు పోలీసు వారు అడ్డగించటంతో . నాకు రాజకీయ పలుకుబడి ఉంది నేను సినీ నటిని నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అ లాయర్ అంతు తేలుస్తానని పోలీసులు అంతు తెలుస్తానని వార్నింగ్ ఇస్తూ ఇష్టానుసారంగా దుర్భాషలాడింది.అక్కడ సిఐని సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది ఆ విషయం నాకు తెలిసి నాకు న్యాయం చేయమని పోలీసు వారిని నేను కోరినాను రెండు రోజులు తర్వాత శిరీష బాయ్ అనే ఎలుకల ముందు మూతికి పూసుకొని తాగినట్టు యాక్టింగ్ చేస్తూ ఒక హాస్పిటల్లో చేరి ఒక పథకం ప్రకారం వీడియోలు మాట్లాడుతూ పోలీసు వారిని కించపరిచే విధంగా ప్రజల్ని తప్పు దారి పట్టించే విధంగా మమ్మల్ని బెదిరించిందే కాక మేమేదో చేశామని ఇష్టానుసారంగా వీడియోలు మాట్లాడుతూ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నన్ను బెదిరించిన వారిపై నన్ను నా భార్య బిడ్డలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు పలనాడు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చి అనంతరం మాట్లాడుతున్నాను దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి ఒక లాయర్ గా ప్రాక్టీస్ చేసుకునే నాకే ఇలా జరిగితే ఇంక సామాన్య ప్రజలకి ఏమన్నా జరిగితే ఏమిటి పరిస్థితి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.
శిరీష బాయ్ అనే మహిళ ద్వారా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ ఎస్పీ కి వినతిపత్రం అందజేశాను.