Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోవిధులు బహిష్కరించిన న్యాయవాదులు

న్యాయమూర్తులకు విజ్ఞాపన పత్రం అందజేత

చిలకలూరిపేట స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించిన న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు బార్ అధ్యక్షులు GVHS ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ వేణుబాబు అతని కుటుంబంపై విశాల్ మార్ట్ లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ ఎఫ్ ఐ ఆర్ నమోదు కాగా నమోదు చేసిన పోలీసుల పైన,బాధితుడు వేణు బాబుపై అక్కడే ఉన్న పలువురుపై శిరీష భాయ్ అనే మహిళ కొంత మందిని వెంట వేసుకొని పోలీస్ స్టేషన్లోనే పోలీసుల సమక్షంలో పోలీసు స్టేషన్, పోలీసులు ,లాయర్లు అన్న కనీస మర్యాద లేకుండా ఆన్ పార్లమెంటరీ పదాలు వాడుతూ ఇష్ట రీతిన దుర్భాషలాడినందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించి గౌరవ న్యాయమూర్తులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.