Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు

మండిపడ్డ మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని

పల్నాడులో వైయస్ జగన్ పర్యటన విజయవంతం

పోలీసులతో పన్నిన కుట్రలు ఫలించలేదు

జగన్‌కు జనంలో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు

కూటమి పాలనపై తీవ్రమవుతున్న ఆగ్రహంకు భయపడుతున్నారు
: మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట :

మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పల్నాడుజిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ వైయస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్యచౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా మాజీ సీఎం వైయస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు. ఆయన పార్టీలోని మరో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైయస్ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజాధరణకు పల్నాడు పర్యటనే సాక్ష్యం పల్నాడు జిల్లాలో వైయస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకుడు నాగమల్లేశ్వరరావును పోలీసుల ద్వారా తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి, ఆయన పర్యాటనను విఫలం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ పర్యటనకు వాహనాలను అందించకూడదని ట్రావెల్ ఏజెన్సీలను బెదిరించారు, పెట్రోల్ బంక్‌లు, హోటళ్ళను బలవంతంగా మూసివేయించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైయస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. వైయస్ జగన్‌కు అడుగుడుగునా స్వాగతం పలుకుతూ రోడ్లపై పోటెత్తారు. వైయస్ జగన్ అంటేనే దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వ మోసాన్ని గుర్తించామంటూ వైయస్ జగన్‌కు ప్రజలు తమ మద్దతును ప్రకటించారు.చనిపోయిన వారిపైనా రాజకీయమా వైయస్ జగన్ పర్యటనలో దురదృష్టవశాత్తు ఇరువురు చనిపోతే, దానిని కూడా వివాదంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. వైయస్ జగన్ కాన్వాయి వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఒక యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతడిని ఆసుపత్రికి తరలించే సరికే అతడు చనిపోయాడు. ఈ ఘటనలు గురించి తెలియగానే వైయస్ఆర్‌సీపీ నేతలు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంను అందచేయడం కూడా జరిగింది. ఆ కుటుంబాల పట్ల మా బాధ్యతను ఎక్కడా మరిచిపోలేదు. చివరికి వారి అంత్యక్రియల్లో కూడా పార్టీ నేతలు ఎంతో బాధతో పాల్గొని, ఆ కుటుంబాలను ఓదార్చడం జరిగింది.అమాయకుల ప్రాణాలను బలికొన్నది చంద్రబాబు కాదా చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి, గోదావరి పుష్కరాల సందర్బంగా తన ప్రచారయావతో 29 మందిని బలితీసుకున్నారు. ఇరుకుసందుల్లో సభలను పెట్టి, జనాలను ఎక్కువగా చూపాలనే ప్రయత్నంలో భాగంగా కందుకూరిలో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాగే గుంటూరులో టీడీపీ తరుఫున చీరెల పంపిణీ పేరుతో మహిళలకు ఆశచూపి, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు అసమర్థ పాలనలో తిరుపతి క్యూలెన్లలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరి కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ మరణాలు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు కావా తన వల్ల జరిగిన దారుణాలను చంద్రబాబు మరిచిపోయారా