Listen to this article

తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025_2026 సంవత్సరానికి 4 తరగతి సెలక్షన్.

జిల్లా కమ్యూనిటీ మొబినేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి.

మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ..

జనం న్యూస్ 20 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శుక్రవారం ఉదయం స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందుటకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినీలకు మండల స్థాయిలో కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్ జరిగినవి కార్యక్రమానికి హాజరైన జిల్లా కమిటీ మొబినేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ. ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే సెలక్షన్ కు ఆర్వత ఉంది క్రీడా పాఠశాలలో అడ్మిషన్ పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు యోగా లాంటివి నేర్పించి వారి చొరవతో ముఖాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన పదిమంది బాలురు 10 మంది బాలికలు మొత్తం 20 మంది విద్యార్థులను ఈరోజు ఎంపిక చేసి జిల్లా స్థాయి సెలక్షన్స్ కు పంపడం జరిగింది అని తెలియజేశారు. ఆ తదుపరి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దామెరలో సామూహిక వన మహోత్సవం కార్యక్రమం సీఎంవో అధికారి బద్ధం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మొక్కలను విధిగా ఇచ్చే బాధ్యత వాటిని రక్షించే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలని ప్రతి పాఠశాల పచ్చదనంతో ఆకర్షనీయంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మొక్కలు నాటిన పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరైన అధికారులు అందరూ పాల్గొని నాటడం జరిగింది మండలంలో పనిచేయుచున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాముడు, ప్రేమ్, ప్రసాద్, సుధాకర్, దివ్య, స్వరూప, శ్రీకాంత్, ఉపాధ్యాయులు తిరుపతి, హరికృష్ణ, శ్రీనివాస్, ఎం ఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.