

జనం న్యూస్ 20 జూన్ (కొత్తగూడెం నియోజకవర్గం)
భారతదేశాన్ని 11 సంవత్సరాల లో విశ్వ గురువుగా నిలిపే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది శీలం విద్యాసాగర్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనపై వికసిద్భారత్ అమృత కాల్ సదస్సు పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టి. నరేంద్రబాబు నియోజకవర్గ కన్వీనర్ పాల్గొని భారతదేశం గత 11 సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలను చేసింది అని అందులో భాగము,మేక్ ఇన్ ఇండియా,ఆయుష్మాన్ భారత్, ఉచిత రేషన్, కరోనా సమయంలో భారత పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్, బేటి పడావో బేటి బచావో మరియు స్టాండ్ ఆఫ్ ఇండియా వంటి పథకాలతో భారతదేశాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్తున్నారని అన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కొత్తగూడెం పట్టణం పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా మారిందని అన్నారు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నారే తప్ప కొత్తగూడెం ప్రజల చిరకాల స్వప్నం 76 జీవో పట్టాలను ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు, కొత్తగూడెం పట్టణానికి 450 కోట్ల రూపాయలతో తీసుకువచ్చిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా ప్రారంభించడంలో విఫలమయ్యారు,కొత్తగూడెం పట్టణంలో ఉన్న రైతు బజార్ వద్ద కూరగాయల అమ్ముకునే షెడ్లను కూల్చివేసి మళ్లీ కట్టిస్తామని ప్రగల్బాలు పలకరే తప్ప ఏ విధమైన కార్యచరణ లేదు అని ఎద్దేవా చేశారు,భారత ప్రభుత్వం కొత్తగూడెం పట్టణానికి ఇచ్చిన అమృత 2.0 పథకం ద్వారా 120 కోట్ల రూపాయలు ఇచ్చిన సంఘతి కొత్తగూడెం ప్రజలకు తెలుసు అని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం పట్టణాలలో భారతీయ జనతా పార్టీ విజయం తప్పదని అన్నారు.నోముల రమేష్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ దేశం లో ఉన్న ప్రజలకు పూర్తి రక్షణ ఉంటుందని రాబోయే ఏ ఎన్నిక వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.గూడ విజయ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది అని ఏ మహిళ తన బిడ్డను పస్తులు ఉంచకూడదని దేశం మొత్తం ఉచితంగా రేషన్ ఇస్తున్న మన అందరి బంధువు అని అన్నారు.జీవికే శివ పట్టణ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న యువతి,యువకులు అందరూ భారతీయ జనతా పార్టీ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ విజయాలను చూసి ప్రపంచమంతా జయహో మోడీ అంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ మాజీ అధ్యక్షులు గొడుగు శ్రీధర్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుంపుల మహేష్,కృష్ణారెడ్డి మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు కొత్తగూడెం పట్టణ కమిటీ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.