

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-
పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పాల్గొన్న పి.ఈ.టి.ల సేవలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో కొనియాడి, అభినందించి, వారికి జ్ఞాపికలను జనవరి 23న ప్రధానం చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – స్టైపెండరీ కానిస్టేబుల్స్ నియామకాల ప్రక్రియలో భాగంగా డిసెంబరు 30 నుండి జనవరి 22 వరకు పోలీసు పరేడ్ గ్రౌండులో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలను నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండులో చేపట్టిన పి.ఈ.టి. పరీక్షల నిర్వహణలో జిల్లాలో వివిధ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పి.ఈ.టి.లుగా పని చేస్తున్న వారి సేవలను వినియోగించుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్థులకు నిర్వహించిన 1600మీటర్ల పరుగు, లాంగ్ జంప్, 100మీటర్లు పరుగు నిర్వహణలో (1) కస్పా హై స్కూలులో పి.ఈ.టి.గా పని చేస్తున్న కే. గోపాల్ (2) గంట్యాడ జెడ్.పి.హెచ్. స్కూలులో పి.ఈ.టీ.గా పనిచేస్తున్న పి.వి.ఎస్.ఎన్.రాజు (3) చింతలపేట జెడ్.పి.టి. హెచ్. స్కూలులో పి.ఈ.టి.గా పని చేస్తున్న కే.లక్ష్మణ (4) గాజులరేగ జెడ్.పి.హెచ్.స్కూలులో పి.ఈ.టి.గా పని చేస్తున్న జి. రవికుమార్ (5) పసుపాం జెడ్.పి. హెచ్.స్కూలులో పి.ఈ.టీ.గా పని చేస్తున్న పి. లీలా కృష్ణ (6) వి.టి. అగ్రహారం జెడ్.పి. హెచ్.స్కూలు లో పి.ఈ.టి.గా పని చేస్తున్న డి.ప్రవీణ్ కుమార్ ల సేవలను వినియోగించుకున్నామన్నారు. పోలీసు కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో 16రోజులపాటు ప్రతీ రోజూ వేకువజాము నుండి పి.ఈ.టి. సేవలందించారని, వారి సేవలను కొనియాడి, అభినందించి, జ్ఞాపికలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ సిఐ బి. లక్ష్మణరావు పాల్గొన్నారు.