

జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి గ్రామ పంచాయితీకి చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శంకరరావును విజయనగరం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిసారు. చీపి పంచాయతీలో బెత్తుకోలలో 15 గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లగా భూములు సాగుచేసుకుంటున్నారని, వాటికి భూ హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పర్యటించి న్యాయం జరిగేలా చూస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు.