Listen to this article

జనం న్యూస్ జూన్ 20:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలో ఏఎస్సైలక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజునా స్థానిక పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏఎస్సై మాట్లాడుతూవనోత్సవం-2025సందర్బంగా నిజామాబాద్ కమిషనర్ అఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పోలీస్ వారికీ సంబందించిన భూమి లో 50మొక్కలు నాటాం అని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటినచోబావితరానికి ఉపయోగం తో పాటు వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవచ్చు, వర్షాలు సంవృద్ధిగా పడుతాయిమరియు జంతువుల బారి నుండి కాపాడుకోవచ్చుఅని అన్నారు. ఈ కార్యక్రమం లోమా సిబ్బంది శ్రీధర్, మనోజ్, అమరేందర్ రెడ్డి, భీక్య నాయక్ పాల్గొన్నారు.