Listen to this article

జనం న్యూస్ జూన్ 21 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. గెజిటెడ్ హెడ్మాస్టర్  ఎస్.బి. ఫిలిప్ మాట్లాడుతూ యోగా వల్ల విద్యార్థులలో కలిగే ఉపయోగాలను వివరిస్తూ మన భారత ప్రాచీన సాంప్రదాయంలో యోగా ఒక భాగం అని ఇది శారీరిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని ప్రతిరోజు విద్యార్థులు యోగ చేయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు దశరథ్ విద్యార్థుల చేత చాలా చక్కగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో శిక్షణ ఫౌండేషన్ మెంటర్  జి రమేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.