

జనం న్యూస్ 21జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు తెలియజేయునది ఏమనగా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటార్ సైకిళ్లలో అమర్చబడుతున్న మార్పు చేసిన సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీలు చేపడతాం. చట్ట ప్రకారం ఈ మార్పులు చట్ట విరుద్ధమైనవని తెలియజేస్తున్నాం: మోటార్ వాహన చట్టం 1988 (సెక్షన్ 52, 190(2)) సెంట్రల్ మోటార్ వాహన నియమాలు 1989 (నిబంధన 120) శబ్ద కాలుష్య నియంత్రణ నియమాలు, పర్యావరణ సంరక్షణ చట్టం 1986 మార్పుచేసిన లేదా అధిక శబ్దం కలిగిన సైలెన్సర్లు వాడడం వల్ల పౌరులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ప్రజలకు సూచనలు: తమ బైక్‌లో మార్చిన లేదా అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ఉంటే, వెంటనే తొలగించాలి. చట్టబద్ధమైన సైలెన్సర్‌ను తిరిగి అమర్చించుకోవాలి.
లేనిచో ఇలాంటి వాహనాలు కనిపిస్తే జరిమానాలు మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. మీ సహకారం వల్లే మేము శబ్ద కాలుష్యాన్ని తగ్గించగలుగుతాం.