

ఇల్లు కాదు ఇది కలల సాకారం….ఇదే ఒక సత్యమైన సంకల్పం…ఇదే ఒక మార్పుకు సంకేతం…ఇందిరమ్మ కల సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం..
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావు
జనం న్యూస్ 21జూన్. కొమురం భీమ్ జిల్లా
. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్( యు) మండలంలోని సీతాగొంది గ్రామ పంచాయతీ పరిధిలోని సీతాగొంది, సోయంగూడ, చింతకర్ర మరియు కోహినూర్ గ్రామాలలో లబ్దిదారులకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావు .ఈ సందర్భంగా చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఆశ్రయం మాత్రమే కాదు – అది గౌరవం, భద్రత, స్వాతంత్ర్యం. *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయడమే మా ధ్యేయం అని తెలిపారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని,రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిర్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సిర్పూర్ యూ మండల నాయకులు ఆత్రం శంకర్ , మాజీ సర్పంచ్ లు మెస్రం భూపతి , ఆత్రం జలీమ్ షా ,కనక సుదర్శన్ ,నాగోరావ్ , మరియు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.