Listen to this article

జనం న్యూస్ జూన్ 21:

నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని తాడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జూన్ 21 తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవమును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ జావిద్ సార్ సమక్షంలో ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ నిర్వహించడం జరిగింది.
యోగ అంటే శరీరమును మనస్సును శ్వాసతో అనుసంధానం చేసే ప్రక్రియ అని తెలియజేయడం జరిగింది. యోగాసనాలు ప్రాణాయామము మరియు ధ్యానము చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యము సిద్ధిస్తుందని తెలియజేస్తూ విద్యార్థుల చేత వివిధ రకాల ఆసనాలను చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులుఏమ్ .సుధాకర్ , జి.గంగాధర్ ,ఇ.రాములు , ఆర్.రవి. టి. స్వప్న పి.నవీన్ ఏ.దేవానంద్ గౌడ్ కే.చక్రపాణి, సిహెచ్.భూపతి ,కే.విజయ , పాల్గొనడం జరిగింది.