Listen to this article

జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


కాట్రేనికోన మండలం చెయ్యేరు నందు గల శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక వివేకానంద కేంద్ర కన్యాకుమారి అమలాపురం కార్యస్థాన్ మరియు నెహ్రు యువ కేంద్ర మరియు కళాశాల ఎన్.ఎస్ ఎస్ విభాగము సంయుక్తంగా యోగా దినోత్సవము ను నిర్వహించారు.ఈ సందర్భముగా ఆ సంస్థ కన్వినర్ మేజర్ పి. శారద గారు మరియు యోగ కార్యకర్తలు స్వర్ణ మరియు మౌనిక పాల్గొన్నారు.ఈ సందర్భంగా శారద గారు ప్రసంగిస్తూ యోగ అభ్యాసం వల్ల అనేక అనారోగ్యముల బారి నుండి రక్షించుకొనుట ద్వారా మానవాళి జీవన ప్రమాణము వృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు యోగ ను దైనిందన జీవన విధానంలో భాగము గావించవలనని వివరించారు.యోగ కార్యకర్తలు స్వర్ణ మరియు మౌనిక విద్యార్థిని విద్యార్థులచే వివిధ యోగ ఆసనములు అందలి మెళకువలు ప్రయోగాత్మకంగా వివరించారు.ఈ కార్యక్రంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ డి.వి.ఎన్.ఎస్. వర్మ కళాశాల పాలకవర్గ సభ్యులు శ్రీ సందీప్ , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బాపి రాజు గారు ,కళాశాల విద్య శాఖాధికారి డా టి.వి ఆర్ రవి కుమార్ గారు, డీన్ ఆర్ & డి డా. వై. వెంకట్ వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు, , ఎన్.ఎస్ ఎస్ విభాగాధిపతి ఎం.వెంకటేశ్వర రావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు