Listen to this article

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ప్రశాంతత పొందవచ్చని కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి హాజరై యోగాసనాలు సాధన చేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ధ్యానం ద్వారా మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని శరీరాన్ని, మనసును ఏకం చేసి ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా నిత్యం ఆచరించాలని కుటుంబ సభ్యులను భాగస్వాములు అయ్యేవిధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. విధి నిర్వహణలో ఉండే అధికారులు, ఉద్యోగులు పని ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి రోజు యోగాసనాలు ఆచరించాలని, ప్రజలకు యోగా వల్ల కలిగే లాభాలను ఆరోగ్యాన్ని వివరించాలని తెలిపారు. యోగాసనాలు సాధన చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు అనంతరం అందరిచే యోగా పై ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు