Listen to this article

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకజూన్‌ 27 నుంచి 30 వరకు కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నామని సభలను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్‌ రావు పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్‌ లో ఈ రోజు మహాసభకు సంబంధించిన గోడపత్రికలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విడుదల చేశారు. ప్రపంచ శాంతి కోసం ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం చేస్తుందన్నారు.ఇజ్రాయిల్‌ పాలస్తీనా పై దాడులు చేయడం దారుణం అన్నారు.ఇజ్రాయిల్‌ దాడులనువ్యతిరేకిస్తూ పాలస్తీనాకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమిస్తుందన్నారు. యోగాంధ్ర చేయడం మంచి విషయం అయినప్పటికీ అనేక సమస్యల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. విద్యాంధ్రప్రదేశ్‌ గా తీర్చిదిద్దాలని, ఆకలి రహిత ఆంధ్ర ప్రదేశ్‌ గా మార్చడానికి కృషి చేయాలన్నారు.