

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవేపాడ మండలంలో కరకవలస పంచాయతీ గిరి శిఖరంపై నివాసముంటున్న మారిక గ్రామ గిరిజన పిల్లలకు నేటికీ చెట్టుకింద విద్యాబోధన అందించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రార్ధన మందిరంలో మధ్యాహ్న భోజనాలు పెడుతున్నారు. ఈ పాఠశాలలో 27 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పక్కా భవనంకు స్థలం సమకూర్చకపోవడంతో నిధులు ఉన్న భవన నిర్మాణం చేపట్టలేని పరిస్థితి ఉందని గిరిజనుల వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.