

(జనం న్యూస్ చంటి)ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారాలని, ఆరోగ్యంగా ఉండడానికి ఇది మనకెంతో సహకరిస్తుందని, విద్యార్థులకు ఇప్పటినుంచి యోగా అభ్యాసం చేయించినట్లయితే వారు ఉత్తేజవంతులుగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా తమ పాఠశాలలో విద్యార్థుల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కొరకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి, నరసింహులు, రజిత మరియు జ్యోతిర్మయి పాల్గొనడం జరిగింది.