Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక పంచాయతీలో ఉన్న శివారు ప్రాంతాల్లో
పేరుకుపోయిన చెత్తను తొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నుండి పేరుకుపోయిన
చెత్తచెదారాన్ని జేసీబీ సహాయంతో
బయటకు తీసి చెత్తను టాక్టర్లతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారని గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని వెంకటరమణ మరియు పంచాయతీ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.