

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు
తాహసిల్దార్, మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం.
చిలకలూరిపేట: కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల్లో ఫీజు వసూళ్లల్లో ఎక్కడ నిబంధనలు పాటించటం కానీ..చట్టం ప్రకారం వసూలు చేయటం కానీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. జీవో నెంబర్ 53, 54 నిబంధన లను ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా ఫీజులు వసూళ్లతో విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ప్రజా సంఘాలు,అఖిల భారత యువజన సమాఖ్యా నాయకులు అన్నారు.సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్థానిక తహశీల్దార్ మహమ్మద్ హుస్సేన్ , మండల విద్యాశా అధికారిణి వి.వి.ఎస్ చంద్రకళ కు నాయకులు వినతిపత్రం అందజేశారు..కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల బదిలి ధ్రువీకరణ పత్రం (టి.సి)పై అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడ మైదానాలు, కనీస సౌకర్యాలు, లైబ్రరీలు లేవు, నిబంధనలు పాటించని సంస్థలకు అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 800 నుంచి 2,220 చదరపు మీటర్ల క్రీడా మైదానం ఉండాలనే నిబంధనలు న్నాయి. అయితే మండలంలో చాలా పాఠశాలల్లో ఇరుకు గదులు, కొన్నిచోట్ల అపార్టు మెంట్లలో తరగతులు నడిపిస్తూన్నారు. అటువంటి వాటి పై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టు విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యలు స్పందించటము లేదని,అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బి. శ్రీను నాయక్,ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవుల రాంబాబు, ఏఐవైఫ్ నాయకులు వెంకటేష్, మల్లికార్జున్, రాంబాబు నాయక్,నాయకులు పుట్టా వెంకట బుల్లోడు, సలికినీడి నాగరాజు, డి గోపి నాయక్, ప్రసాద్ నాయక్, శీను నాయక్, కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.